అండర్-19 ఆసియాకప్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ 50 ఓవర్ల ఫార్మాట్ టోర్నమెంట్ లో ఐసీసీ సభ్య దేశాలు భారత్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తో సహా అసోసియేట్ జట్లు నేపాల్, జపాన్, యూఏఈ, కూడా ఈ కప్లో బరిలో దిగుతున్నాయి. ఈ జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్, జపాన్, యూఏఈ గ్రూప్- ఎలో ఉన్నాయి. శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ గ్రూప్-బిలో పోటీపడుతున్నాయి. టోర్నీ మొదటి రోజు అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్, శ్రీలంక-నేపాల్ పోటీపడుతున్నాయి. మహ్మద్ అమన్ సారథ్యంలోని భారత జట్టు ఈనెల 30న పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది.
Previous Articleస్వయం ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న ఔత్సాహికులకు ఉపయోగకర కార్యక్రమం
Next Article క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సింధు, లక్ష్యసేన్