స్వయం ఉపాధికై చిన్న పరిశ్రమలు స్థాపించాలనే ఆసక్తిగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువత, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు, గ్రామీణ హస్త కళాకారులు, మహిళలు, మహిళా శక్తిసంఘాలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు కోసం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచనల మేరకు జిల్లా పరిశ్రమల శాఖ వారి సహకారంతో ఎం.ఎస్.ఎం.ఈ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర పధకాల ద్వారా రుణాల మంజూరు విషయమై అవగాహన సదస్సు మరియు M.S.M.E నందు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు హాజరు అవుతారు. ఈనెల 30న నరసరావుపేట, భువనచంద్ర టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం జరగనుంది.
Previous Articleమంచి చేసిన నాపైనే నిందలు వేస్తున్నారు: వైసీపీ అధినేత జగన్
Next Article నేటి నుండి అండర్-19 ఆసియాకప్