జూనియర్ ఆసియా కప్ హాకీ లో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. వరుసగా భారత్ కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం. మొత్తంగా చూస్తే ఇది ఐదవ టైటిల్. ఇదివరకు 2004, 2008, 2015, 2023లో టైటిల్స్ సాధించింది. 2021 కోవిడ్ కారణంగా టోర్నీ నిర్వహించలేదు.
ఇక తాజాగా జరిగిన ఫైనల్ లో 5-3 తేడాతో పాకిస్థాన్ పై విజయఢంకా మోగించింది. నాలుగు గోల్స్ చేసి ఆర్జీత్ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దిల్ రాజ్ సింగ్ ఒక గోల్ చేశాడు. పాక్ తరపున సుఫియాన్ రెండు గోల్స్, హాసన్ షాహిద్ ఒక గోల్ చేశారు. ఈ టోర్నీలో జపాన్ మలేషియాపై 2-1 తో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది.
Previous Articleసంధ్య థియేటర్ వద్ద అపశ్రుతి…!
Next Article మళ్లీ డ్రా: సమంగా కొనసాగుతున్న గ్రాండ్ మాస్టర్స్