బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ గెలిచి ఈ సిరీస్ ను విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. అడిలైడ్ వేదికగా రేపు డే/నైట్ పింక్ బాల్ టెస్టు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో మొదటి మ్యాచ్ లో అందుబాటులో లేని కెప్టెన్ రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి టెస్టులో ఓపెనర్లుగా కే.ఎల్.రాహుల్, యశస్వీ జైశ్వాల్ ఓపెనర్లుగా సత్తా చాటిన నేపథ్యంలో రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడో అనే ప్రశ్నకు రోహిత్ తన సమాధానంతో స్పష్టతనిచ్చాడు. కే.ఎల్.రాహుల్ ఓపెనర్ గా వస్తాడని తాను మిడిల్ ఆర్డర్ లో వస్తానని తెలిపాడు. బ్యాటర్ గా తనకు అంత తేలిక కాదని అయితే జట్టుకు ఇదే ఉత్తమం అని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాబట్టడానికి దేనికైనా సిద్ధమని చెప్పాడు. కే.ఎల్.రాహుల్ జైశ్వాల్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి మొదటి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. పెర్త్ పిచ్ పై ఇంత నిలకడగా రాణించడం తేలిక కాదని అన్నాడు. విదేశీ గడ్డపై రాహుల్ అద్భుతంగా రాణిస్తాడని కొనియాడాడు. ఇలాంటప్పుడు జట్టు కూర్పులో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని తెలిపాడు. కెప్టెన్ గా తాను ఏ నిర్ణయం తీసుకున్నా జట్టుకు ఉపయోగకరంగా ఉండాలని అన్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు