వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాలో భారత టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ కు నేరుగా ప్రవేశం లభించింది. దీంతో కెరీర్ లో ఐదో గ్రాండ్ స్లామ్ ఆడనున్నాడు. అతను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 98వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెన్నిస్ ఆస్ట్రేలియా తాజాగా ప్రకటించిన జాబితాలో నగాల్ కు స్థానం దక్కింది. గతేడాది నగాల్ క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రా లో అడుగుపెట్టాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ లో ప్రపంచ నెంబర్ వన్ సినర్ టాప్ సీడ్ గా బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్ లో సబలెంక టాప్ సీడ్ గా బరిలోకి దిగనుంది.
Pic credits: Sumit nagal twitter
Previous Articleగ్రామ,వార్డ్ సచివాలయల ఉద్యోగులకు అలెర్ట్…!
Next Article భారత్ నెట్ పదక్ కేవలం 300 రూపాయలకు ఇంటర్నెట్