గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వనుంది.ఈ మేరకు కేవలం రూ.300కే ఈ అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాయి.అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఈ కనెక్షన్‌ను మొదట దశలో నారాయణపేట,సంగారెడ్డి,పెద్దపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారని సమాచారం.ఈ పథకాన్ని మొదటిగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు.ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తారు.ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లను కేటాయించింది.ఈ కనెక్షన్‌ను 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇస్తారు.
రేపు ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.అయితే కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో పథకాన్ని ఈ ప్రారంభించింది.అయితే ఈ ఫైబర్ నెట్ కనెక్షన్ బాధ్యతను టీ ఫైబర్ సంస్థ టీ సంస్థ తీసుకుంది.