న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో 5 లక్షల పరుగులు చేసిన మొదటి జట్టుగా అవతరించింది. 147 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టు ఇంగ్లాండ్. ఇక ఇది ఇంగ్లాండ్ కు 1087వ టెస్టు. పరుగుల పరంగా ఆస్ట్రేలియా 4,28,868 పరుగులు, భారత్ 586 టెస్టులలో 2,78,751 పరుగులతో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక వెల్లింగ్టన్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం వైపు పయనిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 280 పరుగులకు ఆలౌటయింది. అయితే న్యూజిలాండ్ 125 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో 378-5 పటిష్ట స్థితిలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 533 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు