బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్) లో భారత్ ఎదురీదుతోంది. రెండో రోజు ఆటలో కూడా ఆస్ట్రేలియా దూకుడు ప్రదర్శిస్తూ భారత్ పై స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. భారత్ 180 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ 140(141; 17×4, 4×6) సెంచరీతో కదంతొక్కాడు. లబుషేన్ 64(126;9×4) రాణించాడు. మెక్స్వీనీ (39) పర్వలేదనిపించాడు . దీంతో ఆసీస్ మంచి ఆధిక్యం కనబరిచ గలిగింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 4 వికెట్లు, అశ్విన్, నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ 24(31;4×4), శుభ్ మాన్ గిల్ 28(30;3×4) పోరాడారు.కే.ఎల్.రాహుల్ (7), విరాట్ కోహ్లీ (11), రోహిత్ శర్మ (6), విఫలమయ్యారు. ప్రస్తుతం రిషబ్ పంత్ 28 బ్యాటింగ్ (25; 5×4), నితీష్ కుమార్ రెడ్డి 15 బ్యాటింగ్ (14;3×4) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 29 పరుగులు వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 2 వికెట్లు, పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, స్టార్క్ ఒక వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్:
ఉస్మాన్ ఖవాజా 13(35;2×4), మెక్స్వీనీ 39 (109;6×4), లబుషేన్ 64 (126;9×4), స్టీవ్ స్మిత్ 2(11), హెడ్ 140(141; 17×4, 4×6), మిచెల్ మార్ష్ 9(26;1×4), అలెక్స్ క్యారీ 15(32), కమ్మిన్స్ 12(22;2×4), మిచెల్ స్టార్క్ 18(15;2×4), లైయన్ 4 నాటౌట్, బొలాండ్ (0).
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

