ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసింది. ఇప్పుడు ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాలు అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో రానున్నాయి. కాగా, ఈ మధ్యనే తిరుపతి ఐఐటీకి ఒకటి మంజూరు చేసారు. దీంతో మొత్తం 9 కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. నాణ్యమైన విద్యాప్రమాణాలకు పేరొందిన కేంద్రీయ విద్యాలయాలు ప్రస్తుతం ఏపీలో 35 ఉండగా… వీటిల్లో 6594 మంది ఎస్సీ, 1476 మంది ఎస్టీ, 96 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 9తో కలిపితే మొత్తంగా ఏపీలో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య 44కు చేరింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. నాణ్యమైన విద్యను, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు మరియు వికలాంగ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం 2 కొత్త కేంద్రీయ విద్యాలయాలు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయని అయితే, సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో, ఇప్పుడు ఒక కొత్త మైలురాయిని సాధించామని చెప్పారు.
ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు: వీటితో మొత్తం రాష్ట్రంలో 44కి చేరిన కేవీల సంఖ్య
By admin1 Min Read