బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో 1-1తో సమంగా నిలిచింది. ఈ పరాజయం అనంతరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) లో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది. వరుసగా రెండు సార్లు తుది పోరుకు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా 59.26 ఉండగా…57.29 పాయింట్లతో మూడో స్థానంలో భారత్ నిలిచింది. శ్రీలంక 50.00 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ కు మరో మూడు టెస్ట్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఈ మూడింటిలోనూ గెలిస్తే భారత్ కు ఫైనల్ ఆడే అవకాశాలు ఉంటాయి. 64.03 పాయింట్లతో ఫైనల్ చేరుకుంటుంది. లేకపోతే మిగిలిన జట్ల విజయాల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

