గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన బీఏపీఎస్ (బోచానవాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ) వాలంటీర్ల సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పలుకుబడిని వారి సేవలు పెంచుతున్నారని అన్నారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు దశాబ్దాలు బీఏపీఎస్ వాలంటీర్లకు కూడా కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో, సమాజంలో దిగువన ఉన్న వారికి సాధికారత కల్పించడంలో బీఏపీఎస్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
‘సేవా పరమో ధర్మః’ అనేది మన సంస్కృతిలో భాగమని అవి కేవలం పదాలు మాత్రమే కావని మన జీవన విలువలు అని పేర్కొన్నారు. మతం విశ్వాసాల కన్నా సేవకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సేవను ఒక వ్యవస్థీకృత పద్దతిలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. 28 దేశాల్లో 1800 భగవాన్ స్వామి నారాయణ్ ఆలయాలు, 21,000 ఆధ్యాత్మిక కేంద్రాలు మనదేశ సాంస్కృతిక భావాలను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బీఏపీఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు.
Previous Articleఛత్తీస్‌గఢ్ లో మహిళను హత్య చేసిన నక్సల్స్
Next Article ఒక్క ఘోర ఓటమితో అగ్రస్థానం నుండి మూడో స్థానానికి