భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈనెల 26న (బాక్సింగ్ డే) మెల్ బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ టికెట్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఈ స్టేడియం కెపాసిటీ లక్ష కాగా ఇప్పటికే మొదటి రోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ అభిమానులు కొనుగోలు చేశారు. తొలి రోజుకు సంబంధించి పబ్లిక్ కు అందుబాటులో ఉన్న టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇక ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ విజయభేరీ మోగించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 1-1తో సమంగా నిలిచింది. మొదటి రెండు టెస్టులకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇక మూడవ టెస్టు బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా ఈనెల 14న మొదలవనుంది. ఈ సిరీస్ లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించేందుకు రెండు జట్లూ పోటీపడుతున్నాయి.
Previous Articleపుతిన్‌కు నేనంటే భయం: జెలెన్ స్కీ
Next Article తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయం: కవిత