బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ లో భారత స్టార్ షట్లర్స్ గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం విజయం సాధించింది. గ్రూప్ దశలో మొదటి మ్యాచ్ లో ఓటమిపాలైనా రెండో గేమ్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని గెలుపు కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన గ్రూప్-ఏ రెండో మ్యాచ్ లో 21-19, 21-19తో మలేషియాకు చెందిన టీనా- పెర్లీ టాన్ జోడీ పై నెగ్గింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. గ్రూప్-ఏ లో ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి చైనా జోడీ నాకౌట్ స్థానం ఖరారు చేసుకుంది. ఒక్కో విజయంతో జపాన్, భారత్ నాకౌట్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక మలేషియా రెండు పరాజయాలతో నిష్క్రమించింది. తదుపరి మ్యాచ్ లో ఈ రెండు తలపడనున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు