విడాకులు తీసుకున్న భార్యకు భర్త చెల్లించాల్సిన భరణం కుసంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భరణం విషయాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ విడాకుల కేసును విచారించిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
ఇంతకీ ఆ ఎనిమిది అంశాలు ఏమిటంటే.
1.భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితి
2.భార్య, పిల్లల భవిష్యత్తు, కనీస అవసరాలు
3.భార్యాభర్తల విద్యార్హతలు
4.ఆదాయ వనరులు, ఆస్తులు
5.అత్తింటి వారి ఇంట్లో ఉన్నప్పుడు భార్య జీవనశైలి
6.భార్య ఉద్యోగ, ఉపాధి స్థితి
7.భార్య నిరుద్యోగి అయితే న్యాయపోరాటానికి అయ్యే సహేతుకమైన ఖర్చు
8.భర్త ఆర్థిక స్థితి, ఆదాయం, ఇతర బాధ్యతలు