కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోను ఉపయోగించి తమకు తోచిన విధంగా వార్తలు రాయడాన్ని భారత మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే ఖండించాడు. అవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకేలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గబ్బా వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ట్రోఫీ గురించి సోషల్ మీడియాలో తన పేరు, ఫొటో దుర్వినియోగం కావడంపై ఎక్స్ లో స్పందిస్తూ పోస్ట్ చేశాడు.బ్యాటింగ్లో విరాట్ కోహ్లి వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడని ఆ వార్తల సారాంశం. అవన్నీ అసత్య కథనాలని కుంబ్లే తాజాగా స్పష్టం చేశారు. కొన్ని సోషల్ మీడియా ఎకౌంటులు నా ఫొటోని ఉపయోగిస్తూ కల్పిత వ్యాఖ్యలు నాకు ఆపాదిస్తున్నట్లు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు.
ఆ ఎకౌంటలు, వాటిలో సమాచారంతో తనకేలాంటి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని చెప్పారు. ఇలాంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కుంబ్లే ఎక్స్ లో పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు