ప్రతి 12 సంవత్సరాలకు మహా కుంభమేళా జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ 2025 లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు పర్యాటకులు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కంటే మరింత అద్భుతంగా ఈ మహా కుంభమేళా జరగనుందని యూపీ జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. దీనిని స్వచ్చంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చే విధంగా యూపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం కూడా వాటిని పరిరక్షించనున్నట్లు పేర్కొన్నారు.
మహా కుంభమేళా-2025 లో 45 కోట్ల మంది యాత్రికులు పాల్గొనవచ్చని అంచనా: యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు
By admin1 Min Read