అంతర్జాతీయ క్రికెట్ కు భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కేవలం బౌలర్ గానే కాకుండా బ్యాట్ తోనూ రాణించి భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. మంచి ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 106 టెస్టు మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీశాడు. 3503 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు కూడా ఉన్నాయి. 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156 వికెట్లు తీశాడు. 707 పరుగులు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ (65) ఉంది. ఇక టీ 20లలో 65 మ్యాచ్ లలో 72 వికెట్లు పడగొట్టాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించే ముందు విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ లో భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

