రామాయణంపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా జవాబు ఇవ్వలేకపోవడం గురించి ఇటీవల శక్తిమాన్ నటుడు ముఖేశ్ ఖన్నా స్పందించిన విషయం తెలిసిందే.తప్పు ఆమెది కాదని..ఆమె తండ్రిదని..పురాణాల గురించి పిల్లలకు నేర్పించకపోవడాన్ని తప్పుబట్టారు.దీనిపై తాజాగా శత్రుఘ్న సిన్హా స్పందించారు.‘‘రామాయణంపై ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వలేకపోవడం కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు.కానీ,ఆ వ్యక్తి రామాయణానికి సంబంధించిన అన్ని విషయాల్లో నిపుణుడా? మతాన్ని సంరక్షించే బాధ్యత ఆయనకు ఏమైనా అప్పగించారా?’’ అని ప్రశ్నించారు.తన కుమార్తె విషయంలో గర్వపడుతున్నానని అన్నారు.ఆమె ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చిందని తెలిపారు.2019లో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో సోనాక్షి సిన్హా పాల్గొన్నారు.‘ఆంజనేయుడు ఎవరి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకుచ్చారు?’ అని ప్రశ్నకు ఆమె తెల్లమొహం వేశారు.
Previous Articleఅంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
Next Article స్టార్ హోటల్ సిబ్బంది తీరుపై నటి అసంతృప్తి

