మహారాష్ట్రకు చెందిన రుద్రాంక్ష్ పాటిల్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ లో 254.9 పాయింట్లతో పసిడి పతకాన్ని సాధించాడు. ఈక్రమంలో చైనాకు చెందిన షెంగ్ లిహావో పేరిట ఉన్న 254.5 రికార్డును అధిగమించాడు. 251.4తో కర్ణాటకకు చెందిన అభిషేక్ శేఖర్ రజతం, 229.9తో హార్యానాకు చెందిన హిమాంశు కాంస్య పతకాలు సాధించారు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సీనియర్ విభాగంలో సాహు తుషార్ స్వర్ణం సాధించాడు. ఫైనల్లో 252.3 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్లో తెలంగాణాకు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ (252.2) రజత పతకం గెలుచుకున్నాడు. రాజస్తాన్ కు చెందిన యశ్వర్దన్ 230 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: అశ్విన్ స్థానంలో మరో ఆటగాడు
Next Article షమీ ఆస్ట్రేలియా వెళ్లడం లేదు..!