ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ రూపకల్పన పై చర్చలు జరిపారు. జాతీయ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్ పర్సన్ అదిల్ జైనుల్ భాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక కో వర్కింగ్ స్పేస్ అండ్ నెయిబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ డెవల్మెంట్ పై సీఎం చంద్రబాబు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 5 నుండి 4 రోజుల పాటు కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవాలకు హాజరవ్వాలని కోరారు.
Previous Articleభారత్ – వెస్టిండీస్: రెండో వన్డేలోనూ భారీ విజయం
Next Article దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది..!