మాజీ ఎంపీ,వైసీపీ నాయకుడు నందిగం సురేష్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పు చెప్పింది.ఏపీలో సంచలనం సృష్టించిన మరియమ్మ హత్య కేసులో పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.బెయిల్ కోసం నందిగం సురేశ్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా…ఆయన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది.ఈ మేరకు సురేష్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.మాజీ ఎంపీ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు చెబుతూ…తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని గుర్తుచేసింది.కాగా ట్రయల్ కోర్టు ఆదేశాలలో తాము కల్పించుకోబోమని పేర్కొంటూ..మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది.
Previous Articleఏపీరెరా పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్
Next Article సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఒప్పందం

