ఏపీలో దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాలు అంగీకారం (ఎంఓయు) కుదుర్చుకున్నాయి. రానున్న 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసనింగ్ వంటి కీలక రంగాల్లో 12వేలమందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశమని మంత్రి లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Previous Articleవైసీపీ నేత నందిగం సురేష్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్ …!
Next Article ఈనెల 17న థియేటర్లలోకి..మరోసారి ‘సత్య’ సందడి