దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌర సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం మరింత పెంపొందించడం కోసం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలిదశలో 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఈ రోజు లాంఛనంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించారు.దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రెండో విడతలో 360 సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి.
తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ సౌకర్యం తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నయినా మెసేజ్ ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్ స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డుల వంటి సర్టిఫికెట్లు కూడా పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్: ప్రారంభించిన మంత్రి లోకేష్
By admin1 Min Read