అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్‌తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకొనే పనిలో పడింది. క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.అప్పట్లో ట్రంప్ ఆ సంస్థపై దావా వేశారు.తాజాగా 25 మిలియన్ డాలర్లకు(రూ.216 కోట్లు) ఆ సంస్థ సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.2021లో క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విటర్,ఫేస్బుక్,యూట్యూబ్,ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు.
అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు.ఈ మేరకు ట్రంప్ గతంలో మెటా సంస్థపై దావా వేశారు.దీన్ని సెటిల్ చేసుకునేందుకు తాజాగా మెటా సిద్ధమైంది.అందులోభాగంగా 25 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది.సంస్థలో పలువురు వ్యక్తులు ఓ వార్తా సంస్థతో ఈ విషయాన్ని వెల్లడించారు.మెటా అందించే సొమ్ములో 22 మిలియన్ డాలర్లు ప్రెసిడెన్షియల్ లైబ్రెరీకి,మిగిలినవి కేసు ఖర్చులకు ఉపయోగించనున్నారు.

