ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.ఈ మేరకు 2019లో నామినేటెడ్ పోస్టులకు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ…తీసుకున్న చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు,అందులో ఉన్న లోటుపాట్లను సవరించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కి కేబినెట్ అనుమతి ఇచ్చింది.పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది.గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా కేబినెట్ ప్రత్యేక ప్రతిపాదనలు చేసింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం
By admin1 Min Read