అమెరికా నుండి అక్రమ వలసదారుల తరలించే ప్రక్రియ కొత్తది ఏమి కాదు అని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తెలిపారు.కాగా నిన్న 104 మంది భారతీయులను అమెరికా స్వదేశానికి పంపించడంపై కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు.అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతుంది. 2009 నుండి బహిష్కరణలు జరుగుతున్నాయి.భారత్ నుండి అక్రమ వలసలను అరికట్టేందుకు మనం ప్రయత్నాలు చేస్తున్నాం…అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా తిరిగి పంపించడమే మౌలిక విధానం.ఒక దేశానికి చెందిన ప్రజలు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు,వారిని తమ స్వదేశాలకు రప్పించడం ఆ దేశాల బాధ్యత” అని కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యనించారు.
ఆమెరికా అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ ఇప్పటిది కాదు:కేంద్రమంత్రి ఎస్ జై శంకర్
By admin1 Min Read

