జనసేన పార్టీలో కీలక నేత నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఈ మేరకు ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన విడుదలైంది.కాగా ఆ మూడు ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఈ మూడు సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ మూడు పదవుల్లో నాగబాబుకు ఒక పదవి గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది.రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు.అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోరుతున్నట్లు సమాచారం.ఈ విషయం గురించి ఢిల్లీలో కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రస్తావించారనే మాటలు బయటకు వచ్చాయి.మూడు పదవుల్ని కూటమిలోని మూడు పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా…లేదా టీడీపీ రెండు,జనసేన ఒక పదవి తీసుకుంటుందా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

