ఏపీలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడిన బలమైన నాయకులను తిరిగి సొంత గూటికి తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత,ఏపి సిఎం చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.గతంలో హైదరాబాద్ మేయర్ గా, ఎమ్మెల్యేగా పని చేసిన ఆ పార్టీ మాజీ నేత తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.ఈ నెల 3న ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు.అయితే తీగలను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి ,
బిఆర్ఎస్ నేత మల్లా రెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.
Previous Articleస్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ మార్గదర్శకాలు
Next Article రైతు భరోసా అమలు చేస్తాం:- తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి