తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని ప్రతి నెలా మంగళవారం కల్పించేందుకు ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 3వ తేదీ మంగళవారం నుండి దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 2న తిరుపతి లోని మహాతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమల బాలాజీ నగర్ కమ్యునిటీ హాల్ లో 500 టోకెన్లు ఉదయం 3 నుండి 5 వరకు అందజేయనున్నారు.
ముందుగా వెళ్లి టోకెన్లు తీసుకోవాలి. దర్శనం టికెట్ కోసం స్థానికులు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపాలి. టోకెన్లు పొందిన భక్తులు దర్శనం సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని రావాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని దివ్య దర్శనం క్యూ లైన్ నుండి భక్తులకు దర్శనంకు అనుమతిస్తారు. దర్శనం అనంతరం ఒక లడ్డు ఉచితంగా అందిస్తారు. స్థానిక కోటాలో దర్శనం చేసుకున్న వారికి మరల 90 రోజుల వరకు దర్శనానికి అవకాశం ఉండదు.
Previous Articleఫెంగల్ తుఫాను:- జలదిగ్బంధలో చెన్నై…!
Next Article టీడీపీలోకి మల్లా రెడ్డి ?