ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వచ్చన్ బ్యాంక్ అందించాలని ఈ సందర్భంగా లోకేష్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వతేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పాఠశాలల్లోనే సమావేశాలకు హాజరు కావాలని, ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్బాటాలకు తావీయ వద్దని లోకేష్ స్పష్టంచేశారు.
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం
By admin1 Min Read
Previous Articleతాజ్ మహల్ ను పేల్చేస్తాం అంటూ మెయిల్
Next Article తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి