బీఆర్ఎస్ నాయకుడు, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చింది.ఆయన జర్మన్ పౌరుడిగా కొనసాగుతూనే తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపింది.తప్పుడు పత్రాలతో 15 ఏళ్ళుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చెన్నమనేనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసింది. కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షలు జరిమానా విధించింది.వాటిలో రూ.25 లక్షలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Previous Articleప్రేమ పై సమంత పోస్ట్ వైరల్
Next Article సిరియాలో మళ్లీ స్థిరత్వం రావాలని ఆకాంక్షించిన భారత్

