ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు తెరదించుతూ దశాబ్దానికి పైగా అనిశ్ఛితిలో ఉన్న పశ్చిమాసియా దేశమైన సిరియాను తిరుగుబాటు దారులు తమ చేతిలోకి తీసుకున్నారు. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడి కుటుంబంతో సహా వెళ్లిపోయారు. కాగా, సిరియా పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ దేశంలో మళ్లీ స్థిరత్వం రావాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. సిరియా ప్రజల ఆకాంక్ష మేరకు అనుగుణంగా శాంతి స్థాపన జరిగే విధంగా రాజకీయ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆదేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారం కాపాడుకునే విధంగా అక్కడ రాజకీయ పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సిరియాలోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ వారంతా క్షేమంగానే ఉన్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అక్కడి రాయబార కార్యాలయాన్ని అన్ని వేళలా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు