అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి భారీ షాక్ తగిలింది.ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు రాజీనామా చేశారు.ఈమేరకు ఆయన మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు.కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు.ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు.5 నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు.ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని అవంతి అన్నారు.5 ఏళ్ళు పాలించాలని కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు.ఎన్నో పథకాలను అమలు చేసి కూడా… ఎన్నికల్లో ఓడిపోయామంటే…తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని చెప్పారు.పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అన్నారు.వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని చెప్పారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని… క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గౌరవం లేదని విమర్శించారు.
అవంతి రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత పార్టీని వీడారు.భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.ముఖ్యనేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు

