ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.నాగబాబు ప్రమాణస్వీకార తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి
తన నియోజకవర్గం పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు.30 బెడ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటరను 100 బెడ్ల ఆస్పత్రికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీనికోసం రూ.38కోట్లు వెచ్చించనుంది.ఇక్కడ అవసరమైన 66 పోస్టుల్ని త్వరలోనే సర్కారు భర్తీ చేస్తుందని,వారి జీతాలకు రూ.4.32 కోట్లు వెచ్చిస్తుందని జనసేన Xలో తెలిపింది.

