పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ కీలక ప్రాజెక్టును ఆయన నేడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు వలన 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. 23 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, 2025 జనవరి 2 నుంచి మొదలు పెడుతున్నామని తెలిపారు.
పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లని మరోసారి స్పష్టం చేశారు. బహూళార్దసాధక ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్నారు. రాష్ట్రమంతటికీ ఈ ప్రాజెక్టు వలన ఉపయోగం ఉంటుందని వివరించారు. తమ హాయాంలో గణనీయంగా పనులు జరిగాయని వైసీపీ హాయాంలో ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని విమర్శలు గుప్పించారు.2021 నాటికి పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని, రివర్స్ పాలనతో మళ్ళీ మొదటికి తెచ్చారు. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి, పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని నాశనం చేసారని దుయ్యబట్టారు.
2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు పూర్తి చెయ్యాలనేది అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read