మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇక మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో వీరు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జీవితం, మనకు ఆదర్శం. సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి, టీచర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చారు. క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం ఉంటే, ఏమైనా సాధించవచ్చని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమి, చాలా సుందరమైన ప్రదేశంలో ఇచ్చినట్లు వివరించారు. అమరావతికి, మంగళగిరి ఎయిమ్స్ ఒక సిగలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నంబర్ వన్ అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
డైరెక్టర్, మరొక 10 ఎకరాలు కావాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వెంటనే ఆ భూమి ఇస్తున్నాం. గతంలో నీటి కోసం మీరు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మా ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు పూర్తి సహకారం అందిస్తాం. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నంబర్ వన్ అవడానికి, ఎలాంటి సహకారం అయినా మా ప్రభుత్వం ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నంబర్ వన్ అవుతుందని ఆశిస్తున్నాను: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleమంచు మనోజ్ కేసు…తల్లి సంచలన లేఖ
Next Article ఆ కుట్ర వెనుక ఎవరున్నారో నాకు తెలుసు:- రాజ్‌కుంద్రా