తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తలైవా కెరీర్‌లో 171వ సినిమాగా విశేషంగా నిలవబోతోంది.సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, నాగార్జున,ఉపేంద్ర,సత్యరాజ్,శృతి హాసన్,సౌబిన్ సాహీర్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు