భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈ.ఎస్.ఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. వ్యోమగాములకు శిక్షణ, పలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకారం కోసం ఈమేరకు అంగీకారం కుదిరింది. ఈరెండు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు వ్యోమగాములకు శిక్షణ, అంతరిక్ష ప్రయోగాలు, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ISS)లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సౌకర్యాల వినియోగం, హ్యూమన్, బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య, ప్రజా అవగాహన కార్యకలాపాలలో కలిసి పనిచేస్తాయి. ఆక్సియం-4 మిషన్ లో ఇస్రో గగన్ యాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగాములు ఉన్నారు. దీనికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉపయోగించనున్నారు. ఈ ఒప్పందంతో భారత్ నిర్మించబోతున్న స్వదేశీ అంతరిక్ష కేంద్రం లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారం దొరుకుతుంది. ఈ ఒప్పందం ఇరుదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేయనుంది.
అంతరిక్ష పరిశోధనలలో సహకారం కోసం ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య కీలక ఒప్పందం
By admin1 Min Read