ఏపీ ఫైబర్ నెట్ ను ప్రక్షాళన చేస్తున్నట్లు ఛైర్మన్ జీ.వీ.రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఫైబర్ నెట్ నుండి అక్రమంగా డబ్బులు చెల్లించారని డబ్బును తిరిగి చెల్లించేందుకు 15 రోజుల వ్యవధి ఇచ్చామని తెలిపారు. ఆ వ్యవధిలోగా డబ్బు చెల్లించకుంటే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అర్హత లేని వారిని గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో నియమించిందని గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. వేతనాల పేరుతో ఫైబర్ నెట్ నుండి కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని మండిపడ్డారు. కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని తెలిపారు. అవసరం మేరకు ఉద్యోగులను తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు