దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర భారతంలో మరింత స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. ఢిల్లీ మరియు సరిహద్దు ప్రాంతాల్లో నేటి ఉదయం (9.6 డిగ్రీల) కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా మంచు పడుతుండడంతో వాహానదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 334గా నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ విమాన సర్వీసులకు సంబంధించి ప్రకటన జారీ చేసింది.
విమానాలు రాకపోకల గురించి ప్రయాణికులు ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది.
ఢిల్లీలో తగ్గిన ఉష్ణోగ్రతలు: మంచు ప్రభావంతో ఆలస్యంగా పలు రైళ్లు విమానాలు
By admin1 Min Read

