ప్రతి 12 సంవత్సరాలకు ‘మహా కుంభమేళా’ జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ 2025 లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు పర్యాటకులు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కంటే మరింత అద్భుతంగా ఈ మహా కుంభమేళా జరిగే విధంగా కృషి చేస్తోంది. ఈక్రమంలో ‘అండర్ వాటర్ డ్రోన్’ ను అధికారులు పరీక్షించారు. ఈ ‘మహాకుంబమేళా’ విజయవంతం చేసేందుకు యూపీ ప్రభుత్వం కొత్త సాంకేతికత ఉపయోగిస్తోంది. అందులో భాగంగా అండర్ వాటర్ డ్రోన్ ను పరీక్షీంచినట్లు అధికారులు తెలిపారు. ఇది నీటి కింద వస్తువులను గుర్తించగలదని ప్రమాదవశాత్తు ఎవరైనా మునిగిపోతే డైవర్ల సాయంతో ఆ ప్రాంతానికి చేరుకునేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు