కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఇక మీదట విద్యార్థులు 5, 8వ తరగతుల సంవత్సర పరీక్షల్లో పాసైతేనే పై తరగతులకు అర్హత సాధిస్తారు. లేకపోతే రెండు నెలల్లోగా మళ్లీ పరీక్ష రాసి పాసవ్వాలి. అప్పుడూ పాస్ కాకుంటే చదివిన తరగతే మరోసారి చదవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 5, 8 తరగతులు చదివే విద్యార్థులు పై తరగతులకు వెళ్లాలంటే ఏడాది చివర్లో నిర్వహించే వార్షిక పరీక్షల్లో ఇక పై తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ఉత్తీర్ణత సాధించని యెడల ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి రెండు నెలల్లోపు ఫెయిలైన ఆయా విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటికీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోతే, తిరిగి అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. ఫెయిల్ అయి తిరిగి అదే తరగతిని మళ్లీ చదువుతున్న విద్యార్థి పట్ల క్లాస్ టీచర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నాడో గుర్తించి తగిన సాయం అందించాలని పేర్కొంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయ్యేంత వరకూ ఏ విద్యార్థినీ ఏ స్కూల్ బహిష్కరించకూడదని స్పష్టం చేసింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

