రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే.రష్యా కు సపోర్ట్ చేస్తున్న ఉత్తర కొరియా.. తమ దేశ సైనికులను ఉక్రెయిన్ పై దాడి కోసం రంగంలోకి దింపింది.ఈ క్రమంలోనే తమకు బందీలుగా దొరికిన ఉత్తర కొరియా సైనికులను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ
సౌకర్యాలు కల్పించకుండా రష్యా యుద్ధ రంగంలోకి దించిందని ఆరోపించారు.యుద్ధంలో పోరాడుతూ గాయపడిన ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని,ఆ తర్వాత వారు చనిపోయారని వెల్లడించారు.తీవ్రంగా గాయపడిన వారిని తాము కాపాడలేకపోయామని పేర్కొన్నారు.రష్యా తీరును ఆయన తప్పుపట్టారు.సైనికుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు అన్నారు.
ఉత్తర కొరియా సైనికులకు రష్యా కనీస రక్షణ ఇవ్వలేదు: జెలెన్ స్కీ
By admin1 Min Read
Previous Articleఅజిత్ కొత్త చిత్రం నుండి పాట విడుదల…!
Next Article జాగ్రత్తగా సినిమాలు తీయాలి : మోహన్ లాల్