జనవరి-2024
జనవరి 6: భారతదేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌లో ఇస్రో యొక్క ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక విజయవంతంగా లగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ దాని చివరి కక్ష్యలోకి ప్రవేశించింది.
జనవరి 12: ముంబైని నవీ ముంబైని కలుపుతూ భారతదేశంలోనే అతి పొడవైన వంతెన, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
జనవరి 14: రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ఇంఫాల్, మణిపూర్ నుండి ప్రారంభించారు.
జనవరి 22: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు.
జనవరి 24: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేస్తూ నివేదికను ప్రచురించింది.
జనవరి 31: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఫిబ్రవరి
ఫిబ్రవరి 7: ఉత్తరాఖండ్ శాసనసభ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు 2024ను ఆమోదించింది, ఈ చట్టాన్ని ఆమోదించిన భారతదేశంలో 1వ రాష్ట్రంగా నిలిచింది.
ఫిబ్రవరి 27: రాజ్యసభలోని 245 మంది సభ్యులలో 65 మందిని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరిగాయి, బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది.
మార్చి
మార్చి 11: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి హింసించబడుతున్న మైనారిటీలకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబడింది.
మార్చి 14: ఎన్నికల సంఘం SBI సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ప్రచురించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది.
మార్చి 21: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఏప్రిల్
ఏప్రిల్ 19: అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: 60 స్థానాలకు గాను 46 స్థానాలతో బీజేపీ విజయం సాధించి, పెమా ఖండూ 3వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏప్రిల్ 19: 2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు: రాష్ట్రంలోని 32 స్థానాలకు గాను SKM (సిక్కిం క్రాంతికారి మోర్చా) 31 స్థానాలను గెలుచుకుంది.
మే
మే 22: 2010 నుండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) సర్టిఫికెట్‌లను చెల్లుబాటు చేయకుండా కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మే 26: పశ్చిమ బెంగాల్‌లో రెమాల్ తుపాను తీరాన్ని తాకడంతో భారీ వర్షాల కారణంగా 12 మంది మరణించారు.
జూన్
జూన్ 4: నరేంద్ర మోడీ వరుసగా 3వ సారి ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు.
జూన్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు: టీడీపీ-జనసేన-బీజేపీల ఎన్.డి.ఎ. కూటమి 175 స్థానాలకు మొత్తం 164 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని సాధించింది.అధికార వైఎస్సార్‌సీపీ 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
జూన్ 4: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (UG) ప్రశ్న పత్రాల లీకేజీ వివాదం చెలరేగింది.
జూన్ 4: ఒడిశా శాసనసభ ఎన్నికల ఫలితాలు: నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికి బిజెపి 78 స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
జూన్ 9: జమ్మూ కాశ్మీర్‌లో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేయడంతో 9 మంది మృతి చెందారు.
జూన్ 17: కాంచన్‌జంగా రైలు ప్రమాదం: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది, 10 మందికి పైగా మరణించారు మరియు 60 మంది గాయపడ్డారు.
జూన్ 27: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్‌సభను ప్రారంభించారు.
జూన్ 29: భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
జూలై
జులై 1: భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. భారతీయ న్యాయ సంహిత (BNS) అనేది భారత శిక్షాస్మృతి (IPC)ని భర్తీ చేసే భారతదేశ అధికారిక క్రిమినల్ కోడ్.
జూలై 2: హత్రాస్ తొక్కిసలాట: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 100 మందికి పైగా మరణించారు.
జూలై 12: అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం ముంబైలో జరిగింది, దీనికి అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు.
జూలై 23: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించారు.
జూలై 28: పారిస్‌లో 2024 వేసవి ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
జూలై 30: కేరళలో వయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 231 మంది మృతి చెందగా, 118 మంది గల్లంతయ్యారు.
జూలై 30: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు.
ఆగష్టు
ఆగస్ట్ 1: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఆగస్ట్ 5: బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల తర్వాత షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందింది.
ఆగస్ట్ 7: పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువు వివాదం.
ఆగస్ట్ 8: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకాన్ని, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలుచుకున్నారు.
ఆగస్ట్ 9: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఆగస్టు 9: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యపై నిరసనలు చెలరేగాయి.
సెప్టెంబర్
సెప్టెంబర్ 4: 2024 త్రిపుర శాంతి ఒప్పందం త్రిపురలో 35 ఏళ్ల తిరుగుబాటును ముగించింది.
సెప్టెంబరు 7: మణిపూర్‌లో కుకీ, మైతేయ్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందారు.
సెప్టెంబరు 12: ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు సీతారాం ఏచూరి (72) మరణించారు.
సెప్టెంబరు 15: ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు స్వీకరించారు.
సెప్టెంబరు 18: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.
సెప్టెంబరు 19: ఖలిస్థాన్ వ్యవహారంపై భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం.
అక్టోబర్
అక్టోబరు 5: జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు: కాంగ్రెస్ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ 90 సీట్లకు 48 గెలుచుకున్నాయి.
అక్టోబర్ 9: పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) మరణించారు.
అక్టోబరు 21: వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి “పెట్రోలింగ్ ఏర్పాట్ల”పై భారతదేశం మరియు చైనా సంధానకర్తలు ఒక ఒప్పందానికి వచ్చారు.
అక్టోబరు 29: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌లో కలుషితమైన మిల్లెట్ తినడం కారణంగా ఫంగస్ పాయిజనింగ్‌తో 10 ఏనుగులు చనిపోయాయి.
నవంబర్
నవంబర్ 1: ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) మరణించారు
నవంబర్ 5: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు
నవంబర్ 8: AMU మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
నవంబర్ 10: భారత 50వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు.
నవంబర్ 11: ఎయిర్ ఇండియాతో విలీనమైన తర్వాత విస్తారా తన కార్యకలాపాలను నిలిపివేసింది.
నవంబర్ 15: ఝాన్సీ ఆసుపత్రిలోని నియోనాటల్ వార్డులో మంటలు చెలరేగడంతో 10 మంది చిన్నారులు మృతి చెందారు.
నవంబర్ 20: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: 288 స్థానాల్లో 235 స్థానాల్లో అధికార మహా యుతి కూటమి విజయం సాధించింది.
నవంబర్ 20: గౌతమ్ అదానీ పై యూ.ఎస్ ఆరోపణలు.
నవంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ లో ఘర్షణలు, నలుగురు మృతి.