2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది.అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది.ఇండియా నుంచి ఆ జాబితాలో నిలిచిన ఏకైక పాట ‘కుర్చీ మడతపెట్టి’ అని ప్రకటించింది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏడాది ఎన్నో పాటలు విడుదలైన విషయం తెలిసిందే.‘కుర్చీ మడతపెట్టి’ పాట టాప్‌లో నిలవడంపై సంగీత దర్శకుడు తమన్, నటి శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’లోని పాట ఇదనే విషయం తెలిసిందే.మహేశ్‌బాబు, శ్రీలీల స్టెప్పులు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 52 కోట్ల మంది దీనిని వీక్షించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు