రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు ఈరోజు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చాయి.పాలు,పండ్లు,కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు రోడ్డు,రైలు మార్గాలను పూర్తిగా దిగ్బంధించి పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించడానికి రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.
ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ బంద్‌కు పలు వాణిజ్య,వ్యాపార,విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి.అంబులెన్స్,వివాహ వాహనాలు తప్ప మిగతావేవీ రోడ్లపై అనుమతించమని బంద్‌కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు వెల్లడించాయి.

