‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్.ప్రస్తుతం ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “మార్కో”.మైఖేల్,ది గ్రేట్ ఫాదర్ చిత్రాల ఫేమ్ దర్శకుడు హనీఫ్ అదేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం యాక్షన్ జానర్లో రూపొందుతుంది.డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా…5 రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది.అయితే ఇదే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది చిత్రబృందం.ఈ చిత్రం తెలుగులో జనవరి 01న విడుదల కానుంది.తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ను విడుదలై అభిమానులను అలరిస్తోంది.
Previous Articleడబుల్ ఇంజిన్ సర్కారుపై ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు
Next Article ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక ప్రకటన