డబుల్ ఇంజిన్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వేలాది అభ్యర్థులు పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించి లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై ఇంత చలిలో వాటర్ కెనాన్స్ ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడం అమానుషమన్నారు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే సహించలేక వారిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు . పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్లు, పేపర్ లీక్లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయం మరిచిపోయిందన్నారు.
Previous Articleభోపాల్ లో 40 ఏళ్లుగా పడివున్న విషపదార్థాల తరలింపు
Next Article అదరగొడుతున్న ఉన్ని ముకుందన్ “మార్కో” తెలుగు ట్రైలర్