త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.
ఆలయాలు, గురుద్వారాల్లో పని చేసే పూజారులు, గ్రంథీల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి నెలకు రూ.18వేలు గౌరవ వేతనంగా అందించనున్నట్లు తెలిపారు. మన ఆచారాలను వారు భావి తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నిస్వార్థంగా సేవ చేస్తున్నారని కొనియాడారు. వారి ఆర్థికస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా కేజీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు. పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కేజ్రీవాల్ హామీలు ఇచ్చారు.
Previous Articleఅదరగొడుతున్న ఉన్ని ముకుందన్ “మార్కో” తెలుగు ట్రైలర్
Next Article నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు