భారత పేస్ బౌలింగ్ విభాగానికి వెన్నుముకగా నిలుస్తూ అద్భుతమైన ప్రదర్శనతో మేటి బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (2024) అవార్డు రేసులో నిలిచాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ , ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ రేసులో ఉన్నారు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా, రూట్, బ్రూక్, శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ నామినేట్ అయ్యారు. 2024లో 13 టెస్టులాడిన బుమ్రా 14.92 యావరేజ్, 30.16 స్ట్రైక్తేటుతో 71 వికెట్లు తీశాడు. ప్రస్తుత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా అత్యధికంగా 30 వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ఎమెలియా కెర్ (న్యూజిలాండ్), చమరి ఆటపట్టు (శ్రీలంక), లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా), అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా) పేర్లు నామినేట్ అయ్యాయి.
Previous Articleపీఎస్ఎల్వీ-సీ 60 ప్రయోగం విజయవంతం
Next Article తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త